పసుపు పాలు, పసుపు నీరు రెండింటికీ  వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పసుపు పాలు రోగనిరోధక శక్తిని పెంచడం, జలుబు, దగ్గు, గొంతు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగించడం, నిద్ర నాణ్యతను మెరుగుపరచడం వాపును తగ్గించడం జరుగుతుంది.

చలికాలంలో అనారోగ్యంగా ఉన్నప్పుడు సేదతీరడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకునే వారికి. పసుపు పాలు ఉపయోగపడతాయి

పసుపు నీరు బరువు తగ్గాలని  జీవక్రియను మెరుగుపరచుకోవాలని చూస్తున్న వారికి ఇది మంచి ఎంపిక.

పసుపులో ఉండే కర్కుమిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు చికాకు కలిగించవచ్చు లేదా ఇతర సమస్యలు రావొచ్చు.

పసుపును ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు,

ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కాలేయ సమస్యలు ఉన్నవారు.

ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు, మందులు వాడుతున్నవారు పసుపును ఎక్కువగా తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.