వయసుతో పాటు శరీరంలో వచ్చే కొన్ని మార్పులను ఆర్థరైటిస్‌కు సంకేతాలుగా భావించాలి.

వేళ్లు, కాళ్లు కదుపుతున్నప్పుడు కీళ్లలో శబ్దాలు వినిపిస్తుంటే కార్టిలేజ్ దెబ్బతిన్నట్టు అనుమానించాలి

చేతులు, కాళ్లు పూర్తిస్థాయిలో కదపలేక, పట్టేసినట్టు ఉంటే ఆర్థరైటిస్ ముదురుతోందని అర్థం

రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న కొందరిలో నీరసం, ఇన్‌ఫ్లమేషన్ కారణంగా ఉష్ణోగ్రత కాస్త పెరిగినట్టు ఉంటుంది. 

కాళ్లు, వేళ్లు, మణికట్టు కీళ్లల్లో నిత్యం నొప్పి వేధిస్తుంటే ఆర్థరైటిస్ మొదలైనట్టు అనుమానించాలి

ఉదయం నిద్రలేచాక ఒళ్లంగా పట్టేసినట్టు అరగంటకు మించి ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది

కీళ్ల చుట్టూ వాపు, నొప్పి కూడా ఆర్ణథరైటిస్‌కు ప్రధాన సంకేతం

కీళ్ల నొప్పులు ఉన్న కొందరిలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి కీళ్ల చుట్టూ చర్మం ఎర్రగా, గోరువెచ్చగా మారుతుంది.