హిందూ సంప్రదాయంలో ఆడవారికి సంబంధించి ఎన్నో  ప్రత్యేకతలు, ప్రాముఖ్యతలు ఉన్నాయి. 

మహిళల కట్టు బొట్టుకు మరింత ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా పెళ్లైన ప్రతీ మహిళ నుదుట బొట్టు ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు

పూర్వం అయితే కుంకుమను పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు వీటి ప్లేస్‌లో ఎన్న రకరకాల స్టైల్స్‌లో ఉండే స్టిక్కర్స్ వచ్చాయి

నుదుటన కుంకుమ పెట్టుకోవడం వల్ల ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు.

దేవతల ఆశీర్వాదం పొందడానికి, ప్రతికూల శక్తుల ప్రభావం వ్యక్తులపై పడకుండా ఉండేందుకు నుదుటను కుంకుమను ధరిస్తారు.

కుంకుమ ధరించడం వల్ల శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. దేవుళ్లు ఆశీర్వాదం కోసం కుంకుమను ధరిస్తారు.

జ్ఞాపకశక్తి పెరుగడానికీ నుదుటున కుంకుమ ధరిస్తారు కుంకుమ పెట్టుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గేందుకు సహాయ పడతాయని నమ్ముతారు.