అరటిపండు తిన్న తర్వాత వీటిని తిన్నారో  ఇక అంతే..

అరటిపండు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీన్ని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, పీచు మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

 అరటిపండు తిన్న తర్వాత పుల్లని పండ్లు తినకూడదు. 

అరటిపండు తిన్న తర్వాత పుల్లని పండ్లు తినడం వల్ల అజీర్ణం చేస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి

అరటిపండు తిన్న వెంటనే చల్లటి నీరు తాగకూడదు. దీనివల్ల జీర్ణ ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడతాయి.

 పెరుగు తినకూడదు. అరటిపండు తినడానికి కనీసం 1 గంట ముందు లేదా తరువాత మాత్రమే పెరుగు తీసుకోవాలి

రాత్రిపూట సాధ్యమైనంతవరకు అరటి పండును తినకపోవడమే మేలు.