రాగి జావ.. ఎవరు తాగాలి?  ఎవరు తాగకూడదంటే..  

ప్రతి రోజూ రాగిజావ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి పోషకాలను కలిగి ఉంటుంది.

 రాగులు అనేవి పోషకమైన ఆహారం. కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉన్న మిల్లెట్ ఎముకలు, కీళ్లను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

 నిత్యం ఒక గ్లాస్ రాగి జావ తాగితే వేసవిలో హీట్‌స్ట్రోక్ నుంచి రక్షణ ల‌భిస్తుంది.

  రాగి జావ‌ శరీరాన్ని చల్లబరచే గుణం కలిగి ఉంటుంది.అందువ‌ల్ల సైనస్ సమస్యలు ఉన్నవారు..  

  తరచూ జలుబు మ‌రియు దగ్గుతో బాధ‌ప‌డేవారు రాగి జావ‌ను తాగ‌క‌పోవ‌డ‌మే మంచిది.

మూత్రపిండాల్లో రాళ్లు లేదా మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవారు రాగిజావకు దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

  తక్కువ బ్లడ్ షుగర్ తో ఇబ్బంది ప‌డుతున్న‌వారు రాగి జావ తాగే ముందు త‌ప్ప‌నిస‌రిగా వైద్యుల స‌ల‌హా తీసుకోవాలి.