లివర్ ఫెయిల్ అయితే..  చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తాయి..

మొహం మీద, మెడ మీద బ్రౌన్ ప్యాచెస్ కనబడితే లివర్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం కూడా ఒక కారణం కావొచ్చు. 

లివర్ ఫెయిల్ కావడం వల్ల చర్మంపై తరచుగా దురదలు వస్తుంటాయి. 

లివర్ బైలురిబిన్‌ను సరిగ్గా బ్రేక్ చేయలేకపోవడం వల్ల చర్మం కాస్త పసుపు రంగులోకి మారుతుంది. 

చర్మం పాలిపోవడం కూడా లివర్ ఫెయిల్యూర్‌కు ఒక సంకేతం. 

చర్మంపై దద్దుర్లు, ఏక్నే కూడా లివర్ ఫెయిల్యూర్‌కు ఓ కారణం కావొచ్చు.  

లివర్ ఫంక్షన్ సరిగ్గా లేకపోతే చర్మంపై స్పైడర్ వెబ్ తరహాలో రక్తనాళాలు కనబడతాయి. 

అరచేతులు ఎర్రగా మారడం లివర్ ఫెయిల్యూర్‌కు మొదటి సంకేతం. 

మొహం ఉబ్బడం, కళ్ల కింద చర్మం ఉబ్బడం కూడా లివర్ ఫెయిల్యూర్‌కు ఒక సంకేతంగా భావించాలి. 

రక్తం త్వరగా గడ్డకట్టకపోవడం, చర్మంపై ఎరుపు రంగు మచ్చలు కూడా లివర్ ఫెయిల్యూర్‌కు ఒక కారణం.