కొబ్బరి పువ్వులో ఇన్ని పోషకాలా..?

కొబ్బరి, కొబ్బరి నీళ్లు.. రెండు ఆరోగ్యానికి మంచివే. అలాగే కొబ్బరి పువ్వు సైతం ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

కొబ్బరి పువ్వులో ఫైబర్, ఒమేగా-3 ఆమ్లం, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి.

వీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలు బలంగా ఉంటాయి.

ఇందులో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

కొబ్బరి పువ్వు..  యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఇందులో పుష్కలంగా ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

కొబ్బరి పువ్వులో ఫైబర్ ఉంటుంది. ఇది తింటే.. ఎక్కువ సేపు కడుపు నిండినట్లుగా ఉంటుంది.  

థైరాయిడ్ వ్యాధితో బాధపడేవారికి కొబ్బరి పువ్వు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ పని తీరును మెరుగుపరుస్తుంది. 

మూత్రపిండాల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది.

మొలకెత్తిన కొబ్బరిలో ఉండే థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, ఫోలేట్.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొబ్బరి పువ్వు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తోంది.

దీనిలోని ఇన్సులిన్ స్రావం మధుమేహంతో సంబంధమున్న లక్షణాలను నియంత్రిస్తుంది.

కొబ్బరి పువ్వులో ఉండే పొటాషియం రక్తపోటు స్థాయిని నియంత్రిస్తుంది. మొలకెత్తిన కొబ్బరి తినడం వల్ల గుండె సమస్యలు కూడా నయమవుతాయి. 

ఇందులోని ఇనుము, రాగి పోషకాలు శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిలను మెరుగుపరుస్తాయి.

జుట్టు, చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపించడానికి కొబ్బరి పువ్వు సహాయపడుతుంది.