ఈ పండ్లు తింటే జలుబు, దగ్గు చిటికెలో తగ్గిపోతాయ్!

జలుబు, దగ్గు సమయంలో ఈ పండ్లను తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. తక్షణమే ఉపశమనం లభిస్తుంది.

విటమిన్ సి అధికంగా ఉండే నారింజ రోగనిరోధక శక్తిని పెంచడానికి, వైరస్‌లతో పోరాడటానికి సహాయపడుతుంది.

కివీ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు అధికం. ఇవి జలుబు తీవ్రతను ఇట్టే తగ్గిస్తాయి.

బొప్పాయి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. 

ఫైబర్, విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆపిల్ తింటే గొంతు నొప్పి నుంచి తక్షణమే రిలీఫ్ పొందుతారు.

దానిమ్మ అనారోగ్యంగా ఉన్నప్పుడు కోలుకునేందుకు ఉపకరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి దగ్గును నియంత్రిస్తుంది.

గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ కలిపి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. 

ఉసిరి విటమిన్ సి కి అద్భుత మూలం. జలుబు, దగ్గు ఉన్నప్పుడు తింటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.