ఆకు కూరల్లో అనేక రకాల  పోషకాలు లభిస్తాయి

ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించుకుని ఒక కప్పు టమాట ముక్కలు, ఒక చెంచా పసుపు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి కలిపి కాసేపు వేయించుకోవాలి

ఆ తరువాత కడిగి పెట్టుకున్న ఆవ ఆకులని కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి ఆ తరువాత ముందుగా ఉడికించిన కందిపప్పు వేసి కలపాలి

సరిపడా నీళ్లు రుచికి సరిపడా సైంధవ లవణం, ఒక చెంచా కారం వేసి కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని రెండు చెంచాల నూనె వేసి  ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసి కలిపి

ఈ పోపు మిశ్రమాన్ని పప్పు మీద వేసుకుంటే అధికమైన ఖఫాన్ని తగ్గించి, జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించే .ఆవ ఆకు పప్పు రెడీ.