చలికాలంలో మసాలా దినుసులను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. 

శీతాకాలంలో మసాలా దినుసులను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బందిగా మారుతుంది. 

శరీరంలో వేడి ఎక్కువై చర్మంపై దుద్దుర్లు, దురద వంటి సమస్యలు తలెత్తవచ్చు. 

గర్భిణుల్లో అజీర్ణం వంటి సమస్యలకు కారణమవుతుంది. 

దాల్చిన చెక్క, నల్ల మిరియాలు తదితరాలను ఎక్కువ తీసుకుంటే రక్తపోటు పెరుగుతుంది. 

మసాలా దినుసులను ఎక్కువ తీసుకుంటే గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.