ఇన్సులిన్ రెసిస్టెన్స్..
ఈ లక్షణాలు కనబడితే..!
ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి.
ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరించే ఇన్సులిన్ హార్మోన్‌కు శరీరంలోని కణాలు, కండరాలు, లివర్ స్పందించవు.
ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతే శరీరంలో కొన్ని లక్షణాలు కనబడతాయి. వాటిని చెక్ చేసుకుని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
ఇన్సులిన్ నిరోధకత పెరిగితే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. శరీరం మొత్తం సన్నగా ఉన్నా పొట్ట మాత్రం పెద్దగా కనబడుతుంది.
ఇన్సులిన్ నిరోధకతను ఎదుర్కొంటున్న వారు ఎంతి తింటున్నా ఆకలి వేస్తూనే ఉంటుంది.
ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బీపీ పెరుగుతుంది. అలాగే రక్తంలో షుగర్ స్థాయులు కూడా విపరీతంగా పెరిగిపోతాయి.
ఇన్సులిన్ నిరోధకత వల్ల మెడ, నుదుటిపై చర్మం బాగా నల్లగా మారిపోతుంది.
మహిళలు ఇన్సులిన్ నిరోధకతను ఎదుర్కొంటే పీరియడ్స్ సక్రమంగా రావు. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్య మొదలవుతుంది.
ఇన్సులిన్ నిరోధకత వల్ల ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు చుట్టుముడతాయి. కళ్లు మసకగా కనిపించడం కూడా ఉండవచ్చు.
Related Web Stories
రాగులతో టేస్టీ వెజ్ సూప్.. ఆరోగ్యం మీ సొంతం!
పుచ్చకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
బరువు తగ్గాలనుకునే వారికి బఠానీలు బెస్ట్ చాయిస్..
Benefits Of Aloe Vera: అలోవీరా వాడితే మీ జట్టు ఊడమన్నా ఊడదు..