పుచ్చకాయలో కేలరీలు  తక్కువగా ఉంటాయి

అధిక నీటి కంటెంట్ వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది

ఇది బరువు తగ్గడానికి, బరువును నియంత్రించుకోవడానికి సహాయపడుతుంది. 

పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది, ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

ఇందులో ఉండే మెగ్నీషియం, సిట్రులిన్, లైకోపీన్ వంటి పోషకాలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఇందులో ఉండే లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించుతాయి

కొన్ని రకాల క్యాన్సర్ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి

పుచ్చకాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది  ప్రేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది  శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.

ఇందులో ఉండే పోషకాలు చర్మానికి కాంతినిచ్చి, జుట్టును బలపరుస్తాయి.