ఈ చిన్న అలవాట్లను మార్చుకోండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

చాలా మంది ఆల్కహాల్ తీసుకోవడం, ధూమపానం మాత్రమే చెడ్డ అలవాట్లు అనుకుంటారు. అయితే రోజు వారి జీవితంలో కొన్ని చిన్న చిన్న అలవాట్లు కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 

మీకు వేగంగా భోజనం చేసే అలవాటు ఉందా? అయితే మీకు గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలు వచ్చే ప్రమాదం 10 శాతం పెరుగుతుంది. 

మీరు రాత్రి ఆలస్యంగా భోజనం చేసి వెంటనే నిద్రపోతున్నారా? మీకు ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదం 8 శాతం ఎక్కువ. 

రోజులో 1000 అడుగులు కూడా వేయకుండా కూర్చునే పని చేస్తారా? అయితే మీకు గుండెపోటు, మధుమేహం వచ్చే ప్రమాదం 15 శాతం పెరుగుతుంది. 

ప్రతిరోజూ నూడిల్స్, ప్రాసెస్డ్ ఫుడ్ తింటుంటారా? అయితే మీకు కేన్సర్, గుండెపోటు ముప్పు చాలా ఎక్కువగా పెరుగుతుంది. 

మీకు ఆందోళన, రోజువారి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందా? అయితే మీకు మధుమేహం, రక్తపోటు వచ్చే ముప్పు 12 శాతం పెరుగుతుంది. 

మీరు ఆకుకూరలు, పళ్లు పెద్దగా తీసుకోరా? అయితే మీకు ఐరన్ లోపంతో ఇతర పోషకాల లోపం కూడా పెరుగుతుంది. 

మీరు రోజులో కాఫీ, టీలు ఎక్కువగా తాగుతుంటారా? అయితే మీకు ఎసిడిటీ, జీర్ణ సంబంధ సమస్యల ముప్పు వచ్చే అవకాశం ఎక్కువ. 

మీరు రోజులో కనీసం రెండు లీటర్ల నీరు కూడా తాగరా? అయితే మీకు కిడ్నీ సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం 9 శాతం పెరుగుతుంది.