శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు
ఇవే.. జాగ్రత్త! ప్రాణాలకు ప్రమాదం..
శరీరంలో రక్తం గడ్డకట్టడం చాలా ప్రమాదకరం. ఫలితంగా పలు రకాల ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయి
బాడీలో సిరలు, ధమనులలో రక్తం గడ్డకట్టడం ప్రారంభిస్తే గుండెలో నుంచి శరీరం అంతటికి రక్త ప్రసరణ తగ్గుతుంది.
గుండె కణాలు బలహీనంగా మారినప్పుడు, ధమనులలో రక్తం గడ్డకట్టడం ప్రారంభించినప్పుడు, గుండెలో రక్తం గడ్డ కడుతుంది.
బాడీలో ఉన్న ధమనులలో రక్తం పేరుకుపోతుంటే మాత్రం మీ శరీరంలో హృదయ స్పందన వేగం బలహీనపడటం ప్రారంభమవుతుంది.
రక్తం గడ్డకట్టడం గుండె చుట్టూ లేదా గుండెలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.
అలాగే వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుంది.
వ్యక్తి గుండెలో రక్తం గడ్డకట్టడం వల్ల గుండె కండరాలలో రక్త ప్రసరణ ఆగిపోతుంది.
ఛాతీ నొప్పి లేదా మీ గుండె కొట్టుకోవడం నెమ్మదిగా ఉన్నట్లు అనిపిస్తే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
భోజనం తర్వాత సోంపు తినడం వల్ల కలిగే లాభాలివే..
బరువు తగ్గాలని బ్రౌన్రైస్ అతిగా తింటున్నారా..? ఇది తెలుసుకోండి..
ఖర్జూరంతో అరటిపండు కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
గుడ్లు ఉడికించిన నీటితో ఇలా కూడా చేయొచ్చా..