టమాటా తొక్కతో హైబీపీకి చెక్..  నిజమేనా..

టమాటా తొక్కలో లైకోపీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడానికి, వృద్ధాప్య ఛాయలను తగ్గించడానికి ఉపయోగపడతాయి.

వీటిలో విటమిన్ సి, ఈ ఉంటాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఫేస్ ప్యాక్‌లు, స్కిన్ స్క్రీమ్‌ల కంటే ఇది బాగా పని చేస్తుంది.

టమాటా తొక్కలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వల్ల చర్మం ముడతలు, నల్ల మచ్చలు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా.. మృదువుగా.. మారుస్తుంది. 

హైబీపీని తగ్గించడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

టమాటా తొక్కలో లైకోపీన్ అధికంగా ఉంటుంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గించడంలో సహాయపడుతుంది.

వీటిలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి.

అధిక కొలెస్ట్రాల్ సమస్యను నివారిస్తుంది.

టమాటా తొక్కను ఎండబెట్టి పొడిగా చేసి సూప్‌లు, సాస్‌లలో వాడకోవచ్చు. లేదా కొన్ని రకాల వంటకాల్లో నేరుగా దీనిని వినియోగించ వచ్చు.

టమాటా తొక్కలను పెరుగు, శనగపిండితో కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాస్తే.. చర్మాన్ని ప్రకాశవంతంగా చేసి, మచ్చలను తగ్గిస్తుంది.