వైట్ రైస్‍కు బదులు బ్రౌన్ రైస్ తింటే.. జరిగేదిదే..
ఫిట్ నెస్ జాగ్రత్తగా చూసుకునేవారు సాధారణ బియ్యానికి బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటూ ఉంటారు.
వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ లో పోషకాలు ఎక్కువ ఉంటాయి.
బ్రౌన్ రైస్ లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఆహారంలో వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది. టైప్-2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు బ్రౌన్ రైస్ లో పుష్కలంగా ఉంటాయి.
ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలిని నియంత్రిస్తుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది.
బ్రౌన్ రైస్ లో మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
బ్రౌన్ రైస్ లో గ్లూటెన్ ఉండదు. గ్లూటెన్ అలెర్జీ ఉన్న వ్యక్తులు కూడా దీన్ని తినవచ్చు.
Related Web Stories
ఈ పండు రోజూ తింటే.. గుండె సమస్యలు రావంట..
జబ్బులు రాకూడదంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి..
రెడ్ VS గ్రీన్ యాపిల్ ఏది ఆరోగ్యకరమైనది..
వంట నూనె ఎంత మేరకు వాడాలి..