వర్షాకాలంలో  రోగ నిరోధక శక్తి పెరగాలంటే..

వర్షాకాలంలో  రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం చాలా కీలకం.

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు రుచికరమైన, రోగనిరోధక శక్తిని పెంచే అల్పాహారం గురించి తెలుసుకుందాం..

 పసుపు, అల్లంతో వోట్మీల్..

కావలసినవి: 1 కప్పు వోట్స్,  2 కప్పుల నీరు లేదా పాలు, 1 టీస్పూన్ పసుపు పొడి, 1 టీస్పూన్ తురిమిన అల్లం, తేనె లేదా మాపుల్ సిరప్.

తయారీ విధానం..  ముందుగా ఒక పాన్ తీసుకోండి. అందులో నీరు, పాలు పోసి మరిగించండి.

 ఆ తరువాత ఓట్స్, సరిపడా పసుపు, తురిమిన అల్లం కలపండి.

మీడియం వేడి మీద ఉడికించాలి. అప్పుడప్పుడు దానిని కలపాలి. వోట్స్ ఉడికేంత వరకు 5 నుంచి 10 నిమిషాల వరకు పొయ్యి మీద ఉంచాలి.

ఆ తరువాత తేనె, మాపుల్ సిరప్‌తో మిక్స్ చేయొచ్చు. కావాలనుకుంటే డ్రైఫ్రూట్స్, పండ్లతో డిజైన్ చేయొచ్చు.

ఇప్పుడు వేడి వేడి, ఆరోగ్యకరమైన.. జింజర్, టర్మరిక్ ఓట్‌మీట్స్ తినొచ్చు.

దీనిని ఉదయం అల్పాహారంగా తినడం వల్ల వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.