ఇవి తింటే ఎముకలు  గుల్లబారిపోతాయ్ జాగ్రత్త..!

కాల్షియం లోపం ఒకటే కాదు. కొన్ని ఆహారాలు ఎముకలను బలహీనపరుస్తాయని మీకు తెలుసా..!

అధిక సోడియం ఎముకల నుంచి కాల్షియంను లాగేసుకుంటుంది.

అధికంగా కాఫీ లేదా టీ తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం తగ్గుతుంది.

ధూమపానం, మద్యం సేవించడం ఎముక సాంద్రతను తగ్గిస్తాయి.

శీతల పానీయాల్లో ఎముకలకు హానికరమైన ఫాస్పోరిక్ ఆమ్లం ఉంటుంది.

ప్రాసెస్ చేసిన మాంసంలో ఎముకలకు హాని కలిగించే సోడియం, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువ.

బేకరీ ఉత్పత్తులలో ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి.

బలమైన ఎముకల కోసం సమతుల్య ఆహారం, కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.