ఉదా రంగు ద్రాక్షల్లో ఉండే ‘రెస్వెరాట్రాల్’ లివర్ కు రక్షణ కవచంలా పనిచేస్తుంది.
గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ (కాటెచిన్స్) లివర్ పనితీరు మెరుగుపరుస్తాయి.
వాల్‌నట్స్‌లో ఉండే అమినో యాసిడ్స్ లివర్‌లోని అమ్మోనియాను శుద్ధి చేయడానికి సహాయపడతాయి.
వెల్లుల్లిలో ఉండే ‘అల్లిసిన్’, ‘సెలీనియం’ లివర్ లోని ఎంజైములను యాక్టివేట్ చేసి, విష పదార్థాలను బయటకు పంపుతాయి.
పసుపు కాలేయ ఎంజైమ్‌లు, వాపును తగ్గించడం ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే చేపలు లివర్‌లో వాపు తగ్గడానికి సహాయపడతాయి.
ఆలీవ్ నూనె, ముఖ్యంగా ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలీవ్ ఆయిల్.. కాలేయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
పాలకూర, తోటకూర వంటివి రక్తంలోని టాక్సిన్స్ ను తొలగించడంలో తోడ్పడతాయి.
Related Web Stories
కర్బూజా (MuskMelon) తొక్కలో ఇన్ని పోషకాలు దాగి ఉన్నాయా..?
తవుడు నూనెతో సూపర్ బెనిఫిట్స్..
కంటి ఆరోగ్యం కోసం బెస్ట్ ఫుడ్ ఇదే..
రోజుకు ఎన్ని స్ట్రాబెర్రీలు తినాలో తెలుసా?