మన ఒంట్లో ఉంటూనే మనకు తీరని నష్టం చేసే బీపీ అనే మహమ్మారిని తరిమేయడానికి కొన్ని సింపుల్ ఇంటి చిట్కాలున్నాయి.

మనం రోజూ ఉపయోగించే దుంపలు, కూరలు, పండ్లనే కాస్త స్టైల్ మార్చి జ్యూసుల్లా తీసుకుంటే ఈ సమస్యకు రామబాణంలో పనిచేస్తాయి.

రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తీసుకుంటే బీపీ వెంటనే కంట్రోల్ లోకి రావడంతో పాటుగా ఎన్నో రకాల పోషకాలు శరీరానికి అందుతాయి.

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణ మెరుగుపరిచి, బిపి తగ్గించడంలో సహాయపడతాయి.

కలబంద శరీరాన్ని శుద్ధి చేస్తుంది. దీని రసం తాగితే రక్తపోటు తగ్గడంతో పాటు చర్మం కూడా నిగారిస్తుంది.

టమోటాలో లైకోపీన్, పొటాషియం ఉంటాయి. ఇవి రక్తపోటు తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

నారింజ పండ్లలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా శరీరంలోని రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దీని వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది.

పుచ్చకాయలో “సిట్రుల్లైన్” అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తనాళాలను విస్తరించి బిపిని తగ్గిస్తుంది. అలాగే శరీరాన్ని డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా చూస్తుంది.