వేసవిలోపచ్చి కొబ్బరి లాభాలు తెలిస్తే  చిన్న ముక్క కూడా వదిలిపెట్టరు..

పచ్చి కొబ్బరి తింటే బోలెడు లాభాలున్నాయి. 100 గ్రాముల పచ్చికొబ్బరి నుంచి 354 కెలొరీల శక్తి లభిస్తుంది

కొబ్బరిని తినడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

కొబ్బరిలో పిండిపదార్థం తక్కువగా, పీచు ఎక్కువగా ఉంటుంది. దాంతో రక్తంలో చక్కెరస్థాయులు నిలకడగా ఉంటాయి

ముఖ్యంగా వేసవిలో పచ్చి కొబ్బరి తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు

వేసవిలో అల్పాహారం తర్వాత పచ్చి కొబ్బరి చిన్నముక్క తినడం వల్ల అనేక వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు

 కొబ్బరి తినడం వల్ల మీ చర్మాన్ని మెరుగుపరచడమే కాకుండా మీ జుట్టు నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది

దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.