రోజూ పెరుగు తినే వారికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే..

పెరుగులో మేలు చేసే బ్యాక్టిరియా ఉంటాయి (ప్రోబయోటిక్స్). దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది

ప్రోబయోటిక్స్ కారణంగా రోగ నిరోధక శక్తి కూడా బలోపేతమై ఇన్ఫెక్షన్లు దరి చేరవు

పెరుగులోని కాల్షియం, ఫాస్ఫరస్, ఇతర మినరల్స్ దంతాలు, ఎముకలను దృఢంగా ఉండేలా చేస్తాయి. 

పెరుగుతో బీపీ కూడా నియంత్రణలో ఉండి గుండె కలకాలం ఆరోగ్యంగా ఉంటుంది

ఇందులోని లాక్టిక్ యాసిడ్ సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్‌లా పనిచేసి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. 

డయాబెటిస్ నియంత్రణకూ పెరుగు అవసరం

పెరుగుతో ఆందోళన తగ్గుతుంది, వెజైనల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.