తల్లిపాలతో బిడ్డకు  కలిగే ప్రయోజనాలివే..

అప్పుడే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి, బిడ్డ తీసుకున్న ఆహారం తేలిగ్గా, సులభంగా జీర్ణం కావడానికి తల్లిపాలే సరైనవి. 

ఈ తల్లిపాల ద్వారానే బిడ్డకు కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్లు, మిటమిన్లు, మినరల్స్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం అందుతాయి.

తల్లి పాలలో పాలీఅన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్  ఉంటాయి. ఇవి శిశువులో మెదడు పెరుగుదలకు సహకరిస్తాయి.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించేందుకు ఈ పాలు మెరుగ్గా పనిచేస్తాయి. 

తల్లిపాలలో యాంటీబాడీస్ అధికంగా ఉన్నాయి. పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్లు, ఉబ్బసం, మధుమేహం, జీర్ణాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.

బిడ్డకు తల్లిపాలలో కావాల్సిన అన్ని పోషకాలు, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ లభిస్తాయి.

తల్లి పాలు తాగితే పిల్లలు ఎంత బరువు ఉండాలో అంతే ఉంటారు. ఊబకాయం సమస్య ఉండదు.