వీటిని రోజు తీసుకోవడం వల్ల చాలా లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో 96 శాతం నీరు ఉంటుందని.. శరీరం హైడ్రేట్‌గా ఉండడంతోపాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు.
ఈ దోసకాయలను పచ్చిగా లేదా వండుకొని తినొచ్చు. వీటిని ఎలా తీసుకున్నా శరీరానికి పోషకాలు అందుతాయి. వీటి వల్ల బాడీని హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవచ్చు.
వీటిలో విటమిన్ కె. కాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. తరచూ తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.
దోసకాయలో నీరు, ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను సక్రమంగా జరిగేలా చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
దోసకాయలో క్యాలరీలు, పిండి పదార్థాలు, చక్కెర స్వల్పంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గేలా చేస్తాయి. వీటిలో ఉండే పీచు పదార్థం వల్ల కడుపు నిండుగా ఉన్నట్లుంటుంది. త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గే అవకాశం ఉంది.
మధుమేహంతో బాధపడే వారికి కీర దోసకాయ మంచి ఆహారం. వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) స్వల్పంగా ఉంటుంది. బ్లడ్‌లో గ్లూకోజు నెమ్మదిగా కలిసేలా చేస్తుంది.
దోసకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మధుమేహం త్వరగా ముదరకుండా చేస్తాయి. షుగర్ వ్యాధి కారణంగా వచ్చే దుష్ప్రభావాలను తగ్గిస్తాయి.
వీటిలో కుకుర్‌బిటాసిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలను వృద్ధి చేయకుండా నియంత్రిస్తుంది. వీటిని తీసుకోవడంతో పలు రకాల క్యాన్సర్లును అరికడుతోంది.
సోడియం అధికమైతే రక్తపోటు పెరుగుతుంది. దోసకాయలో ఉండే పొటాషియం సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది రక్తపోటు పెరగకుండా చూస్తుంది.
దోసకాయలో ఉండే పోషకాలు రక్తనాళాల్లో కొవ్వు పూడికలు ఏర్పడకుండా కాపాడుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.