తెల్ల ఉల్లి.. ఎర్ర ఉల్లి.. ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసా? 

ఎర్ర ఉల్లిపాయల లోపలి భాగం లేత గులాబీ రంగులో ఉంటుంది. 

 ఇక తెల్ల ఉల్లిపాయ బయటి భాగం లేత తెలుపు రంగులో ఉంటుంది. లోపలి భాగం పూర్తిగా తెల్లగా ఉంటుంది.

ఎర్ర ఉల్లిపాయలో నీటి శాతం తక్కువగా ఉంటుంది. ఇది రుచిగా ఉంటుంది

ఎర్ర ఉల్లిపాయ కంటే తెల్ల ఉల్లిపాయలో ఎక్కువ నీరు, చక్కెర శాతం అధికంటా ఉంటుంది.

 ఎర్ర ఉల్లిపాయలో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

 ఎర్ర ఉల్లిపాయ రక్తాన్ని శుద్ధి చేసి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

 తెల్ల ఉల్లిపాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం, ఎసిడిటీ వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

తెల్ల ఉల్లిపాయ చర్మం, జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ రసం చర్మాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

 ఎర్ర ఉల్లి కంటే తెల్ల ఉల్లి ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.