రోజూ రాత్రి 8 గంటల పాటు నిద్రిస్తే అనేక ప్రయోజనాలు కలుగుతాయి

రాత్రిళ్లు 8 గంటల నిద్రతో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అనారోగ్యాలు దరిచేరవు

కంటి నిండా నిద్రతో జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. అవసరమైన వెంటనే విషయాలు మదిలో మెదులుతాయి

మంచి నిద్రతో ఆకలిపై అదుపు పెరిగి బరువు ఆటోమేటిక్‌గా కంట్రోల్‌లోకి వస్తుంది.

రోజూ క్రమం తప్పకుండా 8 గంటలు నిద్రపోతే ఆందోళన, ఒత్తిడి తగ్గి మానసిక దృఢత్వం పెరుగుతుంది.

మెదడు పనితీరు కూడా మెరుగై ఏకాగ్రత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలు ఇనుమడిస్తాయి.

గుండె ఆరోగ్యానికీ నిద్ర అవసరమే. చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.