చాలా మందికి వెన్నునొప్పి సాధారణ సమస్యలా అనిపిస్తుంది.

కానీ ఇది తరచుగా వస్తూ ఉంటే లేదా ఎక్కువకాలం కొనసాగితే, అది తీవ్రమైన వ్యాధులకు సంకేతంగా మారే అవకాశం ఉంది.

వెన్నునొప్పితో పాటు మరికొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం తప్పకుండా జాగ్రత్త పడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెన్నునొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. డిస్క్ జారిపోవడం వల్ల నరాలపై ఒత్తిడి ఏర్పడి తీవ్రమైన నొప్పి రావచ్చు.

అలాగే సర్వైకల్ లేదా లంబార్ స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ వంటి సమస్యలు కూడా వెన్ను, మెడ నొప్పికి కారణమవుతాయి.

ఎముకలు బలహీనపడే ఆస్టియోపోరోసిస్, నరాలకు సంబంధించిన సమస్యలు, గాయాలు లేదా దీర్ఘకాలంగా ఉండే మంట కూడా వెన్నునొప్పిని పెంచుతాయి.

ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోని పని చేయడం కూడా ఈ సమస్యలను పెంచుతుంది.

వెన్నెముక ఆరోగ్యంగా ఉండాలంటే సరైన భంగిమలో కూర్చోవడం, నిలబడటం చాలా అవసరం.

ఎక్కువసేపు ఒకే స్థితిలో ఉండకుండా మధ్య  మధ్యలో లేచి నడవాలి.

వెన్నునొప్పి ఎక్కువకాలం కొనసాగితే తప్పకుండా  డాక్టర్‌ను సంప్రదించాలి.