రోజువారీ ఆహారపు అలవాట్లలో తెలియకుండానే చేసే కొన్ని తప్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు.

ఉదయం టిఫిన్‌ స్కిప్ చేయకుండా.. పోషకాలు ఉన్న ఆహారంతో రోజును ప్రారంభించడం మంచిది.

భోజనాన్ని తొందరగా కాకుండా బాగా నమిలి నెమ్మదిగా తినడం మంచిది.

జ్యూస్‌ కంటే పండ్లను నేరుగా తింటే ఫైబర్‌ ఎక్కువగా లభిస్తుంది.

రోజంతా తగినంత నీరు తాగడం ముఖ్యం. శరీర అవసరాన్ని బట్టి నీటి పరిమాణాన్ని తీసుకోవాలి.

నిద్రపోయే ముందు ఎక్కువగా తింటే అజీర్ణం, అసౌకర్యం కలగొచ్చు.

కూరగాయలు, పండ్లు, పప్పులు, ధాన్యాలు, ప్రోటీన్‌ ఉన్న ఆహారాలను సమతుల్యంగా తీసుకోవాలి.