ఇంట్లో చెదల మందు కొడుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి..  

ప్రస్తుతం పాత ఇళ్లలో చెదల సమస్య అధికంగా ఉంటుంది. వీటిని నిర్మూలించేందుకు మందు కొడుతుంటారు. పలు ఘాటైన రసాయనాలతో ఈ మందును తయారు చేస్తారు.

ఇంట్లో చెదలు నిర్మూలించేందుకు ఈ మందు కొడుతుంటే.. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా.. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.

ఈ చెదల మందు పిచికారీ చేసేటప్పుడు ముఖానికి మాస్క్, చేతికి గ్లోవ్స్, కళ్ల జోడు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. 

ఈ చెదల మందు ఇంట్లో స్ప్రే చేసే సమయంలో.. చిన్న పిల్లలు, పెంపుడు జంతువులను బయటకు పంపాలి. లేకుంటే.. వేరే గదిలో ఉంచి తలుపులు వేయాల్సి ఉంటుంది. 

ఈ మందు స్ప్రే చేసే సమయంలో.. పెద్ద వాళ్లు సైతం ఆ ప్రదేశంలో ఉండకుండా ఉండడం ఉత్తమం. ఒక వేళ ఉంటే.. చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 

చెదల మందు స్ప్రే చేసే సమయంలో.. గదులు కిటికిలు, తలుపులు తెరిచి ఉంచాలి. అంటే ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చేయాలి.

ఇక వంట గదిలో ఆహార పదార్థాలు, పాత్రలను దళసరి వస్త్రాలతో కప్పి ఉంచాలి. లేకుంటే ఆహార సామాగ్రిని మరో గదిలో భద్రపరచాలి.

ఈ మందు స్ప్రే చేసిన తర్వాత.. ఇంటి మొత్తం శుభ్రం చేయాలి. అంటే.. తడి గుడ్డతో తుడవాలి. వంట గది, నిద్రించే గదులను మరింత పరిశుభ్రం చేయాల్సి ఉంటుంది. 

రసాయనాలతో కూడిన చెదల మందు ఆరోగ్యానికి అత్యంత హానికరం. కాబట్టి చాలా జాగ్రత్తగా వాడాలి. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడం అత్యుత్తమం. 

ఈ చెదల మందు చాలా పవర్‌గా ఉంటుంది. వాసన పీల్చడం వల్ల పలు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి.

ఈ చెదల మందు కొట్టే సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మూడు నాలుగు రోజుల తర్వాత నుంచి అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి.

చర్మ సమస్యలు.. అంటే ఒళ్లంతా దద్దుర్లు, శరీరంపై బొబ్బలు, కళ్లు మండిపోవడంతోపాటు శాస్వకోశ సమస్యలు వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. 

చర్మ సమస్యలు వస్తే.. అవి ఒక సారిగా దగ్గవు. ఈ వ్యాధులు తగ్గేందుకు చాలా సమయం పడుతుంది. అందుకోసం వాడే మందుల ధరలు సైతం భారీగా ఉంటాయి.