గుండె ఆరోగ్యానికి గుడ్లు మంచివేనా..? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..

గుడ్లలో ప్రోటీన్, విటమిన్లు (B12, D, A), ఖనిజాలు, లుటీన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఆరోగ్యంగా ఉన్నవారు నిత్యం గుడ్డు తీసుకోవడం వల్ల పెద్దగా సమస్య ఏమీ ఉండదని..

గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గుండె జబ్బులు ఉన్నవారు ఉడికించిన గుడ్లలోని తెల్లని భాగాన్ని తీసుకుని...

మధ్యలోని పసుపు పచ్చని భాగాన్ని వదిలేస్తే సరిపోతుందని స్పష్టం చేస్తున్నారు.

అధికంగా గుడ్లు తింటే గ్యాస్, జీర్ణ సమస్యలు, కడుపునొప్పి వంటివి వచ్చే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.