ఆడవాళ్లు సబ్జా గింజలు తింటే ఏమవుతుందో తెలుసా..?

 సబ్జా గింజల్లో ప్రొటీన్స్, కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్‌ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.

సబ్జా గింజల్ని తరచూ తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. శరీర బరువు కూడా కంట్రోల్‌ అవుతుంది.

తలనొప్పి, మైగ్రేన్‌ లాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని.. అవి ఉబ్బిన తర్వాత తాగితే మంచి ఫలితం ఉంటుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో సబ్జా గింజల్ని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.

ప్రొటీన్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ కే సబ్జా గింజల్లో అధికంగా ఉండటం వల్ల జుట్టు రాలే సమస్య, చుండ్రు వంటి జుట్టు సమస్యలు తగ్గుతాయి.

మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫొలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపజేసే విటమిన్‌ ఈ కూడా ఇందులో లభిస్తుంది.

రోజూ ఉదయాన్నే సబ్జా గింజలు నానబెట్టిన నీటిని తాగడం అలవాటు చేసుకుంటే జుట్టు సమస్యలన్నీ తొలగిపోతాయి. నల్లటి జుట్టును కూడా పొందొచ్చు.

 సబ్జా గింజల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల చర్మం పొడిబారడం తగ్గుతుంది.