కాకరకాయ రసం ఎప్పుడు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది?

కాకరకాయలో పొటాషియం, ఐరన్, జింక్, ఫైబర్, ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి పోషకాలు ఉంటాయి.

రోజూ కాకరకాయ రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.

కాకరకాయ రసం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉంటుందని నిపుణులు అంటున్నారు

ఉదయం ఖాళీ కడుపుతో కాకరకాయ రసం తాగడం ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఇది కాకరకాయలో ఉన్న పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించడానికి సహాయపడుతుంది.

కాకరకాయను వేయించడం వల్ల దానిలోని అన్ని పోషకాలు తొలగిపోతాయి.

 వీలైనంత వరకు వేయించిన కాకరకాయను తినకుండా తాజా కాకరకాయ రసం తీసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.