వేసవిలో ఈ పండును  రోజూ ఒకటి తినడం వల్ల  ఎన్ని లాభాలో..

వేసవిలో చాలా మంది గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.

 అయితే కివీ పండు తినడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

కివీ పండులోని విటమిన్-సి, ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు.. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి.

కివీ పండులోని అనేక పోషకాలు అలసట, బలహీనత, కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

కివీ పండులోని విటమిన్-సి.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయం చేస్తుంది.

 కివీ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు విషాన్ని బయటికి పంపడంలోనూ సాయం చేస్తాయి.

 రోజూ ఒక కివీ పండు తినడం వల్ల బరువు తగ్గేందుకూ సహాయపడుతుంది. 

రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగపడుతుంది.