యాపిల్‌లో ఎన్నో పోషకాలు, ప్రొటిన్లు దాగున్నాయి. అందుకే యాపిల్‌ను ఆరోగ్య నిధి అంటారు.
రోజూ యాపిల్స్ తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. చాలా ప్రదేశాలలో రెడ్ యాపిల్ తినడం ఒక ట్రెండ్.. కానీ గ్రీన్ యాపిల్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
గ్రీన్ యాపిల్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేషన్ తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.
గ్రీన్ యాపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.
బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు గ్రీన్ ఆపిల్ తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ గ్రీన్ యాపిల్ చర్మం ముడతలను నివారిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి వయసుకు ముందే చర్మంలో ముడతలు పడకుండా చేస్తాయి.
సాధారణ ఆపిల్ లాగే గ్రీన్ ఆపిల్‌లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. కాబట్టి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రతి రోజూ గ్రీన్ ఆపిల్ తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.