ఈ జ్యూస్‌తో  అసిడిటీ, గ్యాస్ సమస్యలు దూరం..

రుచితోపాటు చిక్కగా ఉండే మారేడు షర్బత్ ఆరోగ్యాన్ని పెంచుతుంది.

అసిడిటి సమస్య ఉన్నవారు మారేడు జ్యూస్ తాగితే మంచి ఉపశమనం ఉంటుంది.

ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి మారేడు జ్యూస్ చక్కగా పనిచేస్తుంది.

దీనిని వరుసగా తీసుకుంటే శరీరంలో నీరసం తగ్గి, శక్తి పెరుగుతుంది.

 అధిక బరువుతో, ఉబకాయంతో ఇబ్బంది పడేవారికి ఇది చక్కని పరిష్కారం.

దీనిని జ్యూస్, షర్బత్ లానే కాదు.. పండు రూపంలో కూడా తీసుకోవచ్చు.