జాగ్రత్త.. గట్ హెల్త్‌ను  నాశనం చేసే అలవాట్లు ఇవే..

మన ఆరోగ్యంలో గట్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కొన్ని అలవాట్లు గట్ హెల్త్‌ను నాశనం చేస్తాయి.

రోజులో ఎక్కువగా టీ, కాఫీలు తాగితే కెఫిన్ ఎక్కువగా శరీరంలోకి వెళ్లి గట్ లైనింగ్‌ను దెబ్బ తీస్తుంది. పరగడుపునే కాఫీ, టీలు తాగితే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. 

ఎక్కువ సేపు నమలకుండా వేగంగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఇబ్బంది పడుతుంది. గట్ హెల్త్ దెబ్బతింటుంది.

రోజులో ఎక్కువ సేపు కూర్చునే పని చేయడం, శారీరక శ్రమ లేకపోవడం కూడా గట్‌లోని గుడ్ బ్యాక్టీరియాను చంపేస్తుంది. 

సమయానికి భోజనం చేయకపోయినా గట్ మైక్రోబయామ్ దెబ్బతింటుంది. 

యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే గట్‌లోని గుడ్ బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది. 

ట్రాన్స్‌ఫ్యాట్స్, షుగర్స్ ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్ గట్‌లోని చెడు బ్యాక్టీరియా పెరగడానికి దోహదపడుతుంది. 

తరచుగా ఒత్తిడికి గురవుతున్నా కూడా గట్‌లోని మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది. 

నిద్రలేమి మీ గట్ సర్కాడియన్ రిథిమ్‌ను దెబ్బ తీస్తుంది.