ప్రస్తుత జీవన విధానంలో మనిషిని అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. వాటిలో క్యాన్సర్ ఒకటి. ఇది ప్రమాదకరమైన వ్యాధే అయినా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు.
క్యాన్సర్‌ను తగ్గించడానికి, రోజూ మనం తీసుకునే ఆహారంలో చిన్న మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం.
బెర్రీలు, చిలగడదుంపలు, ఆలివ్ నూనె, తృణధాన్యాలు, కివిఫ్రూట్ వంటి ఆహారాలు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అందించి క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయి.
చిలగడదుంపలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తాయి. శరీరంలోని కణాలకు నష్టం జరగకుండా నివారిస్తాయి.
బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి తృణధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆహారంలో ఆలివ్ నూనె కీలకమైన భాగం. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
కివిఫ్రూట్‌లో అధికంగా ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది DNA దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడుతుంది