సోడా తాగడం వల్ల లాభమా? నష్టమా?

సోడా తాగడం చాలా మందికి ఉన్న అలవాటు. సాధారణంగా కడుపులో సమస్యలు తలెత్తినప్పుడు సోడా తాగుతూ ఉంటారు.

మరికొంత మంది సరదాకి కూడా అప్పుడప్పుడు సోడా తాగుతారు.

సోడా తాగడం వల్ల లాభమా? నష్టమా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..?

సోడా తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.

సోడా తాగడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. మలబద్ధకం సమస్య ఉండదు.

శరీరంలో పేరుకు పోయిన కొవ్వును కరిగిస్తుంది. సోడా తక్కువగా తీసుకున్నా.. కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అధికంగా తినబుద్ధి కాదు. ఇలా ఈజీగా బరువు తగ్గొచ్చు.

జీవక్రియ వేగం పెరిగితే.. శరీరంలో ఉండే శక్తి నిల్వలు కూడా త్వరగా ఖర్చవుతాయి. క్యాలరీలు ఖర్చు అయితే త్వరగా బరువు తగ్గుతారు. ఇది సోడా వల్ల ఉపయోగమే అంటున్నారు.

వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు.. రోజూ ఒక గ్లాస్ సోడా తాగవచ్చని అంటున్నారు. సోడా తాగడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుందని, రక్తంలో షుగర్ స్థాయిలు పెరగకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు.

సోడా తాగవచ్చు కానీ.. అతిగా తాగవద్దని అంటున్నారు. ఆరోగ్య రీత్యా ఏమైనా సమస్యలుంటే వైద్య నిపుణుల్ని సంప్రదించాలని సూచిస్తు్న్నారు.