మన మెదడు శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి.

ఇది శరీరంలోని వివిధ విధులను నియంత్రిస్తుంది. జ్ఞాపకశక్తిని నిల్వ చేసేది ఇదే.

అందువల్ల మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా కీలకం.

ఈ కింది అలవాట్లను దినచర్యలో తప్పక భాగం చేసుకోవాలి. అప్పుడే చిన్నవయసులోనే మతిమరుపు అనే సమస్య రాదు.

మెదడు సక్రమంగా పని చేయాలంటే నిద్ర చాలా ముఖ్యం. ప్రతి రాత్రి 7–9 గంటల పాటు నిరంతరాయంగా నిద్రపోవడానికి ప్రయత్నించండి.

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు.

శారీరక శ్రమ మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. రోజుకు 30 నిమిషాలు వేగంగా నడవడం కూడా ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.

జర్నలింగ్, సంగీతం వినడం లేదా ప్రకృతిలో సమయం గడపడం వంటి ఒత్తిడి తగ్గించే అలవాట్ల వల్ల మీరు మానసిక ప్రశాంతత పొందుతారు.

పని, భోజనం, విరామాలు వంటి పనులకు రోజూ ఒకే సమయాన్ని కేటాయించడం వలన ఏకాగ్రత మెరుగుపడుతుంది.