ఆరెంజెస్‌లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. వాటిని తినటం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

అయితే, కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఆరెంజెస్ తినకూడదు.

కడుపులో గ్యాస్ సంబంధిత సమస్యలు ఉన్న వారు ఆరెంజెస్‌ను తినకపోవటమే మంచిది. 

కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్న వారు కూడా ఆరెంజెస్ తినకూడదు. 

సిట్రస్ అలెర్జీ ఉన్న వారు కూడా ఆరెంజెస్ తినటం మంచిది కాదు. 

తరచుగా గుండెల్లో మంట పుడుతున్నట్లుగా అనిపించేవారు కూడా వీటికి దూరంగా ఉండాలి. 

దీర్ఘకాలంగా మలబద్ధక సమస్యతో బాధపడుతున్న వారు కూడా వీటిని తినకూడదు. 

ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఆరెంజెస్‌కు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. లేదంటే సమస్య డబుల్ అవుతుంది.