నేటి జమానాలో ఇన్సూరెన్స్ తప్పనిసరి. విపత్కర పరిస్థితుల నుంచి ఇది మనల్ని గట్టెక్కిస్తుంది.

ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన ఇన్సూరెన్స్ పాలసీలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. 

ఇంటి పెద్దను అకాల మృత్యువు కబళించినప్పుడు కుటుంబాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది. 

అగ్నిప్రమాదాలు, ప్రకృతి విపత్తులకు సొంతిల్లు ధ్వంసమైనప్పుడు హోమ్ ఇన్సూరెన్స్‌తో పరిహారం పొందొచ్చు

ఆసుపత్రి పాలైనప్పుడు వైద్య ఖర్చులు భారం కాకూడదనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి

రోడ్డు ప్రమాదాలు, వాహన దొంగతనాలు జరిగినప్పుడు కలిగే నష్టం నుంచి ఆటో ఇన్సూరెన్స్ కాపాడుతుంది

ఈ ఇన్సూరెన్స్‌లు తీసుకునే వారు జీవితంలో నిశ్చింతగా ఉండొచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు.