లోన్ సెటిల్‌మెంట్ మంచిదేనా.. ఇలా చేస్తే భవిష్యత్తుల్లో లోన్స్ రావా..

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రుణ గ్రహీతలు లోన్ సెటిల్‌మెంట్ ఎంచుకుంటారు

ఉద్యోగ నష్టం, వైద్య అవసరాల వంటి సందర్భాల్లో ఇది ఉపశమనంగా ఉంటుంది

ఈ సెటిల్‌మెంట్ ద్వారా రుణభారం తక్కువవుతుంది, కానీ పూర్తిగా మాత్రం తగ్గదు

బ్యాంకు నిబంధనల ప్రకారమే సెటిల్‌మెంట్‌ జరుగుతుంది

ఇలా చేస్తే క్రెడిట్‌ రిపోర్ట్‌లో సెటిల్డ్‎గా వస్తుంది, పాజిటివ్‌ కాకుండా నెగిటివ్‌గా

ఇది మీ క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది

భవిష్యత్తులో రుణాలు లేదా క్రెడిట్‌ కార్డులు పొందడం కష్టమవుతుంది

క్రెడిట్‌ హిస్టరీలో ఇది ఏడు సంవత్సరాల వరకు ప్రభావం ఉంటుంది

బ్యాంకులు అధిక వడ్డీకి లోన్స్ ఇవ్వవచ్చు లేదా రుణాన్ని తిరస్కరించవచ్చు

మీ లోన్ గడువు పెంచాలని కోరుతూ సెటిల్‌మెంట్‌ను తప్పించుకోవచ్చు