వైద్య రంగంలో దుమ్ము లేపుతున్న ఏఐ..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన వైద్య, ఆరోగ్య రంగంలో కీలక భూమిక పోషిస్తోంది.

అరుదైన వ్యాధులను నిర్ధారించేందుకు ఆధునిక ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

ముఖ్యంగా రోగుల ఆరోగ్య డేటాను విశ్లేషించి సమస్యను ముందుగానే గుర్తిస్తోంది ఏఐ.

గ్రామీణ ప్రాంతాల్లో క్యూఎక్స్ఆర్ అంటే ఏఐ సాధనాలు క్షయవ్యాధిని గుర్తించేందుకు దోహదపడుతున్నాయి.

ఛాతీ ఎక్సరేలను విశ్లేషించడం ద్వారా క్షయవ్యాధిని ఏఐ సాధనాలు గుర్తిస్తున్నాయి.

వైద్య సేవలు మెరుగుపరిచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతోంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలకు ఏఐ ఆధారిత శిక్షణ సాధనాలు వైద్య విజ్ఞానాన్ని అందిస్తున్నాయి.

రోగులకు ప్రాథమిక వైద్య సలహాలు అందించి సరైన నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేస్తున్నాయి.