పన్ను చెల్లించేవారికి టాప్-7 టిప్స్

కొత్త పన్ను విధానం ఇప్పుడు తప్పనిసరిగా ఎంచుకోవాలి. అయితే, పాతవిధానాన్ని అనుసరించేవారు తగ్గింపులతో సహా ఎంపిక విషయమై ముందుగానే యాజమాన్యానికి తెలియజేయాలి.

ఉద్యోగి యాజమాన్యం నుంచి ఫారం-16 తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంకా TDS, జీతానికి సంబంధించిన పూర్తి వివరాలు కచ్చితంగా ఉన్నాయని ధృవీకరించుకోవాలి.

వ్యత్యాసాలను నివారించడానికి ఫారం 26AS తో క్రాస్-చెక్ చేయండి. ఫారం 26AS తో ఫారం 16 వివరాలు సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి.

కొన్ని పెట్టుబడులు, పన్ను మినహాయింపులు అందించకపోయినా అవి దీర్ఘాకాలంలో సంపద సృష్టికి ప్రయోజనకరంగా ఉంటాయి.

గణనీయమైన హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) కు మినహాయింపు పొందే అర్హత ఉంటే పాత పన్ను విధానం మరింత ప్రయోజనకరం.

మీకు ఒకటి కంటే ఎక్కువ హౌస్ ప్రాపర్టీల నుంచి ఆదాయం లేదా మూలధనం నుంచి లాభాలు అందుతుంటే ITR-2 ఉపయోగించండి. లేకపోతే ITR-1 సరిపోతుంది.

మీ ఆదాయ వివరాలు సరిగ్గా ఉన్నాయనేందుకు రుజువుగా పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి పొందుతున్న వడ్డీ, ఇతర ఆదాయ వివరాలను సమర్పించండి.