Advertisement
Advertisement
Abn logo
Advertisement

డంబెల్స్ లేకుండా మంచినీళ్ల బాటిల్స్‌తో ఇలా చేస్తే..

ఆంధ్రజ్యోతి(09-04-2020)

వర్కవుట్‌ ఫ్రమ్‌ హోమ్‌

డంబెల్స్‌ లేకుండా ఇంట్లో చేసుకొనే సులువైన వ్యాయామం ఇది. దీనికి కావల్సిందల్లా రెండు వాటర్‌ బాటిల్స్‌. మీరూ ప్రయత్నించండి.  


‘టి’- ఆకారంలో: ముందుగా నీళ్లతో నిండిన బాటిల్స్‌ను మధ్యలో పట్టుకుని, అటెన్షన్‌ పొజిషన్‌లో నిలుచోండి. ఇప్పుడు నిదానంగా మీ చేతులను ‘టి’-ఆకారం వచ్చేవరకు పైకి ఎత్తండి. అంటే మీ భుజాలకు సమాంతరంగా అనమాట. ఒక్క క్షణం ఆగి, స్టార్టింగ్‌ పొజిషన్‌కు వచ్చేయండి. మళ్లీ చేతుల పైకి ఎత్తండి. ఇలా ఐదుసార్లు చేయాలి. 


గోడకుర్చీ: చిన్నప్పుడు స్కూల్లో టీచర్లు, ఇంట్లో పెద్దవాళ్లు పనిష్‌మెంట్‌ ఇవ్వాలంటే గోడ కుర్చీ వేయించేవారు... గుర్తుందా! దాన్ని ఒక్కసారి గుర్తుకుతెచ్చుకోండి. గోడకు మీ వీపును పూర్తిగా ఆనించి, రెండు చేతులూ కిందకు వదిలేసి, కుర్చీలో కూర్చున్నట్టు కూర్చోండి. ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులనూ మీ భుజాలకు సమాంతరంగా (టి-ఆకారం) వచ్చేవరకూ ఎత్తండి. ఓ క్షణం ఆగి మళ్లీ మొదటి పొజిషన్‌కు వచ్చేయండి. మళ్లీ ఇందాక చెప్పినట్టు పైకి ఎత్తండి. ఇలా ఐదుసార్లు చేయండి. 


ప్రయోజనం: మొదటి ఎక్సర్‌సైజ్‌వల్ల చేతి కండరాలు గట్టిపడతాయి. రెండో వ్యాయామం చేస్తే... భుజాలు దృఢంగా ఉంటాయి. ఏదైనా నిదానంగా, పక్కాగా చేయాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి.

Advertisement
Advertisement