Advertisement
Advertisement
Abn logo
Advertisement

బిగిసిన కండరాలకు ఉపశమనం

ఆంధ్రజ్యోతి(04-06-2020)

రోజూ శారీరక శ్రమ లేకపోతే కండరాలు బిగువుగా తయారవుతాయి. దీనివల్ల పోను పోనూ రకరకాల నొప్పులు, ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ వ్యాయామాలు చేస్తే అలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. 


నడుస్తూ..: కాళ్ల మధ్య భుజాలంత దూరం పెట్టి నిల్చోండి. మోకాళ్లు కొద్దిగా వంచండి. రెండు చేతులూ పట్టుకొని, భుజాల ఎత్తులో, ఛాతీకి దగ్గరగా తీసుకురండి. నడుము పై భాగం నిటారుగా, చూపు నేరుగా ఉండాలి. ఇప్పుడు ఎడమ కాలిని ఓ అడుగు పక్కకు జరపండి. తరువాత అదే డైరెక్షన్‌లో కుడి కాలిని కదిలించండి. ఇదే విధంగా కుడి కాలితో చేయండి. అలా పది సెట్లు చేయండి. 

ఎగురుతూ..: కాళ్లను కొద్దిగా ఎడంగా పెట్టి నిల్చోండి. పాదాలు ‘వి’ షేప్‌లా పక్కకు తిరిగి ఉండాలి. తరువాత నడుము, మోకాళ్లు కొద్దిగా వంచి, రెండు చేతులను కలిపి.. ఛాతీకి దగ్గరగా పెట్టండి. ఇప్పుడు చిత్రంలో చూపినట్టు చేతులు పైకి చాచి, ఎగురుతూ, కాళ్లని ఒకదానికి ఒకటి తగిలించండి. మళ్లీ స్క్వాట్‌ పొజిషన్‌లోకి వచ్చేయండి. ఇలా 45 సెకన్లలో సాధ్యమైనన్ని చేయండి.
వెనక్కి చాస్తూ..: అటెన్షన్‌ పొజిషన్‌లో నిల్చోండి. కుడి కాలిని వెనక్కి తీసుకువెళ్లండి. ఎడమ పాదం వెనకాల కుడి పాదం, అలాగే నడుము పై భాగం నిటారుగా ఉండాలి. ఇప్పుడు ఎడమ తొడ నేలకు సమాంతరంగా వచ్చే వరకు మోకాళ్లు వంచండి. తరువాత మొదటి పొజిషన్‌కు వచ్చి, మళ్లీ ఇదే విధంగా చేయండి. ఇలా 10 సెట్లకు తగ్గకుండా ప్రయత్నించండి.

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...