Advertisement
Advertisement
Abn logo
Advertisement

వర్కవుట్‌ ఫ్రమ్‌ హోమ్‌

ఆంధ్రజ్యోతి(11-04-2020)

పనులన్నీ చకచకా కానిచ్చేస్తాము కానీ... రోజూ ఓ అరగంట వ్యాయామం చేయాలంటే మాత్రం ఎక్కడలేని బద్ధకం వచ్చేస్తుంది. అయితే ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి... పెద్దగా కదలకుండా, సోఫా మీదనో... మంచంపైనో కూర్చొనే కొన్ని ఎక్స్‌ర్‌సైజ్‌లు చేసుకోవచ్చు. అవే ఇవి... 


పడుకొని: మంచంపై కాళ్లు జాపుకొని వెల్లకిలా పడుకోండి. ఇప్పుడు కుడి మోకాలును మీ ఛాతీకి ఆనించే ప్రయత్నం చేసి, 20 సెకన్లు ఉంచండి. తరువాత మునుపటి పొజిషన్‌కు వచ్చేయండి. అలాగే ఎడమ మోకాలును ఆనించండి. అలా నాలుగు సార్లు చేయాలి.


కూర్చొని: సోఫాపైనో, మంచం మీదో కూర్చొని, కాళ్లు జాపండి. పాదాలు తలగడకో, గోడకో ఆనించండి. ముందుకు వంగి, చేతులతో బొటనవేళ్లు తాకి, 20 సెకన్లు ఉండండి. కాళ్లు మడవకూడదు. స్ర్టెయిట్‌గా పెట్టాలి. తరువాత సాధారణ పొజిషన్‌కు వచ్చి, మళ్లీ బొటనవేలు పట్టుకొంటూ... అలా ఐదుసార్లు చేయండి.  


నిల్చొని: శరీరం బరువంతా మునివేళ్లపై పెట్టి... నిటారుగా నిల్చోండి. చేతులు పైకి ఎత్తి, బాడీని పూర్తిగా స్ర్టెచ్‌ చేయండి. బాగా ఊపిరి పీల్చుకొని, నిదానంగా వంగుతూ మునివేళ్లను పట్టుకోండి. అలా 10 సెకన్లు ఉండండి. ఈ మొత్తం చేయడానికి 20 సెకన్ల సమయం పడుతుంది. ఇప్పుడు యథాస్థితికి వచ్చి, మళ్లీ ఇదే విధంగా ఐదుసార్లు చేయండి.

Advertisement
Advertisement