పరువు పోయిందని ప్రాణం తీసుకున్న తల్లి, ఇద్దరు చెల్లెళ్లు.. ప్రేయసితో పాటు కొడుకు ఊళ్లోంచి పారిపోయాక..

ABN , First Publish Date - 2022-05-27T20:00:06+05:30 IST

ఆ యువకుడు ఒక దళిత యువతితో ప్రేమలో పడ్డాడు.. పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకరించకపోవడంతో ఇద్దరూ గ్రామం నుంచి వెళ్లిపోయారు.

పరువు పోయిందని ప్రాణం తీసుకున్న తల్లి, ఇద్దరు చెల్లెళ్లు.. ప్రేయసితో పాటు కొడుకు ఊళ్లోంచి పారిపోయాక..

ఆ యువకుడు ఒక దళిత యువతితో ప్రేమలో పడ్డాడు.. పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకరించకపోవడంతో ఇద్దరూ గ్రామం నుంచి వెళ్లిపోయారు.. దాంతో యువతి కుటుంబ సభ్యులు యువకుడి కోసం అన్వేషణ ప్రారంభించారు.. ఇద్దరూ ఎక్కడున్నారో చెప్పాలని యువకుడి కుటుంబాన్ని వేధించారు.. పోలీసులతో కలిసి ఇంట్లోకి ప్రవేశించి వారిని బెదిరించారు.. దీంతో ఆ యువకుడి తల్లి, ఇద్దరు చెల్లెళ్లు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.. ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 


ఇది కూడా చదవండి..

ఈ తల్లీకొడుకులను దొంగలే చంపారనుకున్న పోలీసులు.. కానీ కేసులో షాకింగ్ ట్విస్ట్.. సొంత చెల్లే కాబోయే భర్తతో కలిసి..


ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లా బచౌద్ గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన దళిత యువతితో ప్రేమలో పడ్డాడు. ధనికులైన యువతి తల్లిదండ్రులు ఆ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఆ యువకుడు తన ప్రేయసితో కలిసి ఊరు వదిలి పారిపోయాడు. వారిద్దరినీ వెతికేందుకు యువతి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. పోలీసుల ద్వారా యువకుడి తల్లి, చెల్లెళ్లను బెదిరించారు. మంగళవారం సాయంత్రం యువతి సోదరుడితో కలిసి ఆ యువకుడి ఇంటికి వెళ్లిన పోలీసులు వీరంగం సృష్టించారు. అరెస్ట్ చేస్తామని బెదిరించారు. 


తీవ్రంగా భయపడిపోయిన యువకుడి తల్లి, చెల్లెళ్లు విషం తాగేశారు. ఆ యువకుడి పెద్ద సోదరి బుధవారం చనిపోగా, మిగిలిన ఇద్దరూ గురువారం మరణించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ మృతదేహాలతో గ్రామస్తులు నిరసనకు దిగారు. యువతి సోదరుడు, తండ్రి, పోలీసులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ పరిస్థితిని చక్కదిద్దారు. ఎస్సైతో సహా మొత్తం ఆరుగురిపై కేసులు పెట్టారు. 

Updated Date - 2022-05-27T20:00:06+05:30 IST