ఈ తల్లీకొడుకులను దొంగలే చంపారనుకున్న పోలీసులు.. కానీ కేసులో షాకింగ్ ట్విస్ట్.. సొంత చెల్లే కాబోయే భర్తతో కలిసి..

ABN , First Publish Date - 2022-05-27T18:06:22+05:30 IST

అతను ఓ నగల వ్యాపారి.. గురువారం మధ్యాహ్నం భోజనం చేసి షాప్‌నకు వెళ్లిపోయాడు..

ఈ తల్లీకొడుకులను దొంగలే చంపారనుకున్న పోలీసులు.. కానీ కేసులో షాకింగ్ ట్విస్ట్.. సొంత చెల్లే కాబోయే భర్తతో కలిసి..

అతను ఓ నగల వ్యాపారి.. గురువారం మధ్యాహ్నం భోజనం చేసి షాప్‌నకు వెళ్లిపోయాడు.. అతను తిరిగి వచ్చి చూసే సరికి ఇంట్లో భార్య, కొడుకు విగత జీవులుగా పడి ఉన్నారు.. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి.. వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎవరో దొంగలు డబ్బు కోసం ఇంట్లో ప్రవేశించి అడ్డు వచ్చిన తల్లీకొడులను చంపి ఉంటారని అనుకున్నారు.. అయితే తన భార్య సోదరి తనకు కాబోయే భర్తతో కలిసి ఈ ఘటనకు పాల్పడి ఉంటుందని హతురాలి భర్త ఫిర్యాదు చేశాడు. 


ఇది కూడా చదవండి..

రాత్రి అన్నం తిన్నాక వాకింగ్‌కు వెళ్లిన 33 ఏళ్ల భార్య.. తెల్లారినా తిరిగి రాకపోవడంతో కేసు పెట్టిన భర్త.. అదే ఊళ్లో ఓ ఇంట్లో


ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన లలిత్ వర్మ అనే వ్యక్తి ఓ నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య శిఖా (37), కొడుకు గిర్బాసు (8) ఉన్నారు. గురువారం మధ్యాహ్నం లలిత్ భోజనం చేసి షాప్‌నకు వెళ్లిపోయాడు. అతను తిరిగి వచ్చే చూసే సరికి ఇంట్లో భార్య, కొడుకు విగత జీవులుగా పడి ఉన్నారు. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే లలిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎవరో దొంగలు డబ్బుల కోసం ప్రవేశించి ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావించారు. అయితే లలిత్ వర్మ మరో వాదన వినిపిస్తున్నారు. 


`నా భార్య తండ్రి ఓ ప్రభుత్వోద్యోగి. అతను సర్వీస్‌లో ఉండగానే ఇటీవల చనిపోయారు. అతనికి కొడుకులు లేరు. నా భార్య, ఆమె సోదరి అంజలి మాత్రమే వారసులు. ఆ ఉద్యోగం కోసం, డబ్బుల కోసం అక్కాచెల్లెళ్ల మధ్య గొడవలు జరిగాయి. దాంతో నా భార్య మీద అంజలి పగ పెంచుకుంది. చంపేస్తానని బెదిరించింది. అంజలి తనకు కాబోయే భర్త సోమేష్‌తో కలిసి ఈ పని చేయించి ఉంటుంద`ని పోలీసులకు లలిత్ ఫిర్యాదు చేశారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాఫ్తు సాగిస్తున్నారు. 

Updated Date - 2022-05-27T18:06:22+05:30 IST