ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతి.. సరిగ్గా 3 రోజుల తర్వాత యువతి అరెస్ట్.. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-06-01T21:03:45+05:30 IST

ఆమె బంగ్లాదేశీ యువతి.. ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా భారత్‌కు చెందిన ఓ యువకుడు పరిచయమయ్యాడు..

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతి.. సరిగ్గా 3 రోజుల తర్వాత యువతి అరెస్ట్.. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏంటంటే..

ఆమె బంగ్లాదేశీ యువతి.. ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా భారత్‌కు చెందిన ఓ యువకుడు పరిచయమయ్యాడు.. ఆ పరిచయం ప్రేమగా మారింది.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. అయితే ఆ యువకుడికి పాస్‌పోర్ట్ లేదు.. దీంతో ఆ యువతి ఓ సాహసం చేసింది.. నదిలో గంట పాటు ఈదుకుంటూ బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు చేరుకుంది.. మూడ్రోజుల కిందట కోల్‌కతాలోని కాళీఘాట్‌లో తన ప్రియుడిని పెళ్లాడింది.. అయితే దేశంలోకి అక్రమంగా ప్రవేశించించిందనే కారణంతో ఆ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. 


ఇది కూడా చదవండి..

బస్సులో పక్కన కూర్చున్న వాళ్ళు ఇచ్చే వాటిని తింటున్నారా..? ఈ 52 ఏళ్ల మహిళకు ఏం జరిగిందంటే..


బంగ్లాదేశ్‌కు చెందిన కృష్ణా మండల్ అనే యువతికి ఫేస్‌బుక్ ద్వారా పశ్చిమ బెంగాల్‌కు చెందిన అభిక్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే అభిక్‌కు పాస్‌పోర్ట్ లేదు. దీంతో కృష్ణ సాహసం చేసింది. మొదట సుందర్బన్ ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి నదిలో గంట పాటు ఈదుతూ గమ్యానికి చేరుకుంది. మూడ్రోజుల క్రితం కోల్‌కతాలోని కాళీఘాట్‌ గుడిలో కృష్ణ, అభిక్ పెళ్లి చేసుకున్నారు. అయితే కృష్ణ అక్రమంగా దేశంలోకి ప్రవేశించిందనే విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను బంగ్లాదేశ్ హై కమీషన్‌కు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. 


ఈ ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఎమాన్ హుస్సేన్ అనే యువతి చాకోబార్ కోసం ఇలాగే నదిలో ఈతకొట్టుకుంటూ భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించింది. ఆమెను అరెస్ట్ చేసిన భారత్ పోలీసులు, బంగ్లాదేశ్ పోలీసులకు అప్పగించారు. వారు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి ఆమెకు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించారు. 

Updated Date - 2022-06-01T21:03:45+05:30 IST